Fighter OTT : బాలీవుడ్ గ్రీకువీరుడు హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్లో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించింది. అనిల్ కపూర్ మరో ముఖ్య పాత్రలో మెరిశాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న సినిమా థియేటర్లలో విడుదలైంది. భారత వైమానిక దళం తన యుద్ధ విమానాల నేపథ్యానికి దేశభక్తిని జోడించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో హృతిక్ సినిమాపై వివాదం నెలకొంది.
ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె మధ్య లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సీన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ‘ఫైటర్(Fighter)’ చిత్రానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారి ఒకరు లీగల్ నోటీసు కూడా పంపారు. కలెక్షన్లతో పాటు వివాదాల చుట్టూ తిరిగే పోరాట చిత్రం కూడా డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ హృతిక్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మార్చి 21 నుండి ఫైటర్ చిత్రం OTTలో అందుబాటులో ఉంటుంది అనే టాక్ ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
Fighter OTT Updates
ఫైటర్ భారతదేశపు మొట్టమొదటి ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా పరిగణించబడుతుంది. అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజిదా షేక్, అశుతోష్ రాణా, రిషబ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మ్యాట్రిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ ఫైటింగ్ మూవీని నిర్మించాయి. విశాల్ శేఖర్ స్వరాలు సమకూర్చారు.
Also Read : Natural Star Nani: నాని ‘హాయ్ నాన్న’కు ‘బిహైండ్‌వుడ్స్’ అవార్డ్ !