Fighter Movie: ‘వార్’, ‘పఠాన్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె అనిల్‌కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న సినిమా ‘ఫైటర్’. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ అండ్ సెకండ్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఫైటర్(Fighter)’ సినిమాలో హృతిక్.. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా కనిపించగా… దీపిక పదుకొణె స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా, గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారు.
Fighter Movie Updates
దీనితో క్రిస్టమస్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. ‘నిప్పులు చిమ్మే ఈ ఎయిర్ డ్రాగన్స్ ఒక నెలలో మిమ్మల్ని కలుస్తాయి. 75వ భారత గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు జనవరి 25న మీ థియేటర్లలో కలుద్దాం’ అంటూ వ్యాఖ్యానించారు హృతిక్. భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ చూడని వాయు విన్యాసాలు ఈ సినిమాలో తెరకెక్కించినట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : Hero Suhas Movie : 2024 ఫిబ్రవరి 2న సుహాస్ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా