Dulquer Salmaan : చార్లీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కన్నడ సినిమా గుర్తుకు వస్తుంది. అది పూర్తిగా కుక్కతో హీరో అనుబంధం గురించి. ఇదే సమయంలో మలయాళం సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా క్రియేటివిటీకి, కథకు, భావోద్వేగాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడి కథలు ఎంతగానో ఆకట్టుకునేలా ఉంటున్నాయి. అంతే కాదు మనసులను తాకేలా చేయడంలో చాలా కష్ట పడుతున్నారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దర్శకుల గురించి.
Dulquer Salmaan Comment
అలాంటి కోవలోకి వచ్చించి ఈ చార్లీ మూవీ. ఇందులో సహజ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మార్టిన్ ప్రక్కట్. వీరిద్దరూ సినిమాకు ప్రాణం పోశారు. ఇక సల్మాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు స్టార్ డమ్ కంటే సినిమా ముఖ్యం. అందులోని కథ , పాత్ర అంతకంటే ప్రధానం కూడా.
చార్లీ సినిమా కాదు మనందరి జీవితంలో ఒనగూరే కథ. ఒకరకంగా చెప్పాలంటే ఉత్కంఠ భరితమైన ప్రేమ కథ. ఇది పూర్తిగా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పక తప్పదు. స్వేచ్ఛగా ఉండాలని అనుకునే పాత్ర చుట్టూ కేంద్రీకృతమై ఉన్న భావద్వేగాలతో ఆద్యంతమూ సినిమా నడుస్తుంది.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ తో పాటు పార్వతి, అపర్ణ గోపినాథ్, నేడుముడి వేణు, మార్టిన్ ప్రక్కట్ నటించారు. గాలిలా స్వేచ్ఛగా ఉండాలని, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తీసుకు రావాలని కోరుకునే పాత్ర మనందరినీ కట్టి పడేసేలా చేస్తుంది. ప్రేమ, కరుణ శక్తివంతమైన దారాలతో దానిని ముడి పెడుతుంది. చార్లీ సినిమాలో ఒక రకంగా చెప్పాలంటే దేశ దిమ్మరి. తనను అనుసరించే మరో పాత్ర టెస్సా. దీనిని పార్వతి చేసింది. మొత్తంగా వీలైతే ఎక్కడ దొరికినా చూసి తీరాల్సిన సినిమా చార్లీ.
Also Read : Prudhvi Raj Shocking Comment :పోసాని అరెస్ట్ పృథ్వీ రాజ్ కామెంట్స్