Dear Uma : ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన చిత్రం డియర్ ఉమ(Dear Uma). తెలుగుమ్మాయి సుమయరెడ్డి ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. తను నటించడమే కాకుండా ఈ సినిమాను నిర్మిస్తోంది కూడా. కథ కూడా తానే రాయడం విశేషం. సాయి రాజేశ్ మహాదేవ్ దీనికి దర్శకత్వం వహించాడు. మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుందంటూ వెల్లడించారు.
Dear Uma Movie- Love Story..
అద్బుతమైన ప్రేమ కథను మరింత హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. పోస్టర్, సాంగ్స్ మంచి బజ్ కల్పించేలా చేశాయి. అత్యున్నతమైన సాంకేతిక విలువలతో దీనిని రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు దర్శకుడు . ఇందులో పృథ్వీ అంబర్ సుమయ రెడ్డితో కలిసి నటించాడు. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, రూపలక్ష్మి, తదతర నటులు ఇందులో కీలక పాత్రలలో నటించడం విశేషం.
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి రాజ్ తోట కెమెరా మెన్ గా చేయగా రథన్ సంగీతం అందించారు. పూర్తిగా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడింది సుమయరెడ్డి. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది . త్వరలోనే డియర్ ఉమ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది నటి , నిర్మాత, కథకురాలు సుమయరెడ్డి. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు ఇక హీరో, హీరోయిన్లతో పని లేదని స్పష్టం చేసింది. అందుకే ఈ సినిమాకు కథే బలమని పేర్కొంది. మూవీ సక్సెస్ కావడం పక్కా అని తెలిపింది.
Also Read : Hero Allu Arjun-Atlee :బన్నీతో అట్లీ కుమార్ మూవీ సిద్దం