ఓటీటీలో నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా ఫర్జీ
Farzi : కోవిడ్-19 తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ఫ్లాట్ ఫాంకు ప్రేక్షకులు దగ్గరయ్యారు. ముఖ్యంగా ఓటీటీల్లో విడుదల అవుతున్న వెబ్ సిరీస్ లను చూడటానికి ఆశక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదల అవుతున్న వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో అశ్లీలత ఎక్కువ ఉందనే వాదన బలంగా వినిపిస్తున్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న భారతదేశంలో వాటికి ఆదరణ తగ్గలేదు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా వంటి ఓటీటీల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కొత్త కొత్త హర్రర్, క్రైమ్, థ్రిల్లర్, లవ్, కామెడీ….. సిరీస్ లతో ఓటీటీ ఫ్లాట్ ఫాంలు సందడి చేస్తున్నాయి. కొత్త కొత్త సీజన్ లు, ఎపిసోడ్స్ తో సినిమాలకు ధీటుగా ప్రేక్షకుల్లో ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం స్కామ్-2003, కాలాపానీ, ఫ్రీ లాన్సర్, సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వంటి వెబ్ సిరీస్ లు సందడి చేస్తుండగా…. గతంలో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, సేక్రెడ్ గేమ్స్, స్కామ్ 1992, ఇన్ సైడ్ ఎడ్జ్, ఫర్జీ(Farzi) వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
Farzi – నాలుగు కోట్ల వ్యూస్ తో నెంబర్ 1 గా ఫర్జీ
ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకింగ్ ఏజెన్సీ ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ లపై స్పెషల్ సర్వే నిర్వహించింది. ఒక్క సీజన్‌లో వచ్చిన వ్యూస్ ఆధారంగా నిర్వహించిన ఈ సర్వే యొక్క టాప్ 10 భారతీయ వెబ్ సిరీస్‌ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ సర్వేలో షాహిద్ కపూర్-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫర్జీ వెబ్ సిరీస్ నాలుగు కోట్ల వ్యూస్ తో అగ్ర స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఫర్జీ జూన్ నెల వరకు 3.7 కోట్ల వ్యూస్ సాధించగా… తాజాగా ఈ వ్యూస్ సంఖ్య 4 కోట్లకు చేరుకుంది. రెండో స్థానంలో 3.5 కోట్ల వ్యూస్ తో అజయ్ దేవగన్ నటించిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ నిలిచింది. సేక్రేడ్ గేమ్స్, మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను సైతం ఫర్జీ వెనక్కి నెట్టింది.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న మీర్జాపూర్, పంచాయత్ వరుసగా 3.2 కోట్లు, 2.96 కోట్ల వ్యూస్ సాధించగా… డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అనే వెబ్ సిరీస్ 2.91 కోట్ల వ్యూస్ తో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాప్ 10లో ఉన్న ఇతర సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, ది నైట్ మేనేజర్, తాజా ఖబర్, ది గ్రేట్ ఇండియన్ మర్డర్, స్కామ్ 1992 ఉన్నాయి. అయితే ఆదరణ ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సేక్రేడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌కు టాప్ 10లో చోటు చేసుకోలేదు. ఎందుకంటే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ తక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తోంది.
షాహిద్ కపూర్-విజయ్ సేతుపతిల కాంబోలో తెరకెక్కిన ఫర్జీ
విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన హిందీ వెబ్‌సిరీస్ ఫర్జీ(Farzi). ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజ్ సక్సెస్ తర్వాత దర్శకద్వయం రాజ్‌డీకే తెరకెక్కించిన సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫేక్ కరెన్సీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన ఈ ఫర్జీ(Farzi) వెబ్‌సిరీస్ ను ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. తమ అవసరాలు తీరే దారి కనిపించక ఫేక్ కరెన్సీ దందాలోకి అడుగుపెట్టిన ఇద్దరు సాధారణ యువకులు ఆ ఊబిలోనే ఎలా కూరుకుపోయారనే పాయింట్‌ను ఎనిమిది ఎపిసోడ్స్‌లో చూపించారు. దొంగనోట్ల ముద్రించే యువకుడిగా షాహిద్‌కపూర్, దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేసే పోలీసు అధికారిగా విజయ్ సేతుపతితో పాటు సిరీస్‌లో కనిపించే ప్రతి క్యారెక్టర్‌కు ఓ లక్ష్యాన్ని ఫిక్స్ చేస్తూ అన్నింటిని కలుపుతూ ఆధ్యంతం ఉత్కంఠతను రేపే విధంగా కథను తెరకెక్కించారు దర్శకద్వయం రాజ్ డీకే.
Also Read : Ilayaraja: ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్