Family Star Movie : విజ‌య్ రియ‌ల్ ఫ్యామిలీ స్టార్

ఆక‌ట్టుకుంటున్న ప‌రుశురామ్ టీజ‌ర్

ర‌ష్మిక మంద‌న్నా , విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి న‌టించిన సినిమా గీత గోవిందం. ఆ సినిమా బిగ్ స‌క్సెస్. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్. త‌ను మినిమం గ్యారెంటీ ఉన్న ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్ బాబుతో స‌ర్కారు వారి పాట తీశాడు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత రౌడీ బాయ్ తో రెండో సినిమా తీస్తున్నాడు. అదే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫ్యామిలీ స్టార్ అని.

శ‌ర వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. తాజాగా చిత్రానికి సంబంధించి టీజ‌ర్ రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. కంటెంట్ ఉంటే చాలు సినిమా త‌ప్ప‌కుండా ఆడుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంది. అందుకే విజ‌య్ క‌రెక్ట్ గా త‌న కథ‌కు స‌రిపోతాడ‌ని ఎంపిక చేశాన‌ని చెప్పాడు ప‌రుశురామ్.

త‌ను తీసే విధానమే కాదు డైలాగులు కూడా భారీగా ఉండవు. చాలా అర్థ‌వంతంగా, స‌మ‌యానికి త‌గ్గ‌ట్టుగా ఉంటాయి. తాజాగా తీస్తున్న ఫ్యామిలీ స్టార్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశాడు ద‌ర్శ‌కుడు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ద్వారా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. క‌థ బాగుంటే ఎలాంటి సినిమాకైనా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌రన్న పేరుంది. ఇక ప‌రుశురామ్ త‌నే క‌థ రాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు ఫ్యామిలీ స్టార్ కు.

ఎప్ప‌టి లాగే గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌డం విశేషం. ఈ సినిమా త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు. ఇప్ప‌టికే విజ‌య్ న‌టించిన ఖుషీ స‌క్సెస్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు దర్శ‌కుడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com