Family Star Movie : మ‌ళ్లీ మెరిసిన మృణాల్ ఠాకూర్

రౌడీ బాయ్ తో ఫ్యామిలీ స్టార్

ముంబై ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప‌లు సినిమాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం రెండు సినిమాలపై ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకుంది. ఇక బికినీలు, లిప్ కిస్ ల‌కు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌క పోవ‌డంతో మృణాల్ కు ప‌లు మూవీస్ లో న‌టించేందుకు ఛాన్స్ ల‌భిస్తోంది.

తాజాగా నేచుర‌ల్ స్టార్ నానితో మృణాల్ ఠాకూర్ హై నాన్న మూవీలో న‌టిస్తోంది. సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్ , వీడియోలు, సాంగ్స్ దుమ్ము రేపాయి. భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ ఇచ్చిన సంగీతం అద్భుతంగా ఇచ్చాడు.

హై నాన్న‌తో పాటు మ‌రో సినిమాలో మెరిసింది. రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి మృణాల్ ఠాకూర్ క‌లిసి ఫ్యామిలీ స్టార్ చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీకి సంబంధించి టీజ‌ర్ రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు.

ఇందులో విజ‌య్ పాత్ర ఖుషి చిత్రానికి మించి ఉండేలా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. 2024లో సంక్రాంతి రోజున ఈ చిత్రం విడుద‌ల కానుంది. వినోదం, మాస్ అప్పీల్ ను రివీల్ చేస్తూ దీనిని రూపొందించాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com