Fahadh Faasil: విక్రమ్, పుష్ప సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకన్న ప్రముఖ మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్. లోకేశ్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషనల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘విక్రమ్’ సినిమాలో ఫహాద్ ఫాజిల్ తనదైన ముద్రవేసారు. దీనితో ఫహాద్ ఫాజిల్ ను తన నెక్ట్స్ ప్రాజెక్టుకు కూడా ఓకే చేసాడు కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ‘లియో’ విజయం తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూపొందించనున్న కొత్త చిత్రం ‘కూలీ’లో ఫహాద్ ఫాజిల్ ను ఓ పత్యేకమైన పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం.
Fahadh Faasil Movie Updates
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’. ఈ సినిమాని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడీ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil)ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఫహాద్ ఇప్పటికే లోకేశ్ దర్శకత్వంలో ‘విక్రమ్’లో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు మరోసారి అలాంటి శక్తిమంతమైన పాత్రనే ఈ చిత్రంలో తన కోసం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ చిత్ర విషయమై ఫహాద్‌తో సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. జులై తొలి వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనిరుధ్ సంగీతమందిస్తుండగా… గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read : Allu Arjun : ఐకాన్ స్టార్ బన్నీ కి తగిలిన మరో భారీ షాక్