Kiran Kumar Reddy : హైదరాబాద్ – మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారని… కానీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు అనే తీర్మానాన్ని వైఎస్సార్ హయాంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం పెట్టించాలని చూసిందని అన్నారు.
Kiran Kumar Reddy Comments
2014 కాదు తెలంగాణ 2009 లోనే రావాల్సి ఉండేదన్నారు. తాను చీఫ్ విప్ గా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి పిలిచి… ‘మనం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం’ అనే తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పారని తెలిపారు.
ఎన్నికల ముందు మనం ఈ తీర్మానాన్ని పెడితే మనం ఓడిపోతామని ఆయనతో తాను చెప్పానని… ‘నా చేతుల్లో ఏమీ లేదు. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు’ అని ఆయన తనతో అన్నారని పేర్కొన్నారు.
దీంతో తాము ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడామని… ‘మేము తెలంగాణకు అనుకూలం’ అనే తీర్మానాన్ని ‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని మార్చి పెట్టామని వెల్లడించారని చెప్పారు. రాష్ట్ర విభజన జరగదనే తాము అనుకున్నామని… దురదృష్టవశాత్తు రాష్ట్రం విడి పోయిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ ఉన్నా విభజన ఆగేది కాదని చెప్పారు.
Also Read : Victory Venkatesh Movie : వెంకీ..అనిల్..దిల్ హ్యాట్రిక్ మూవీ విక్టరీ