Sandal Wood : శాండల్ వుడ్ ఇండస్ట్రీ లో అత్యవసర సమావేశాలు

ఆయన మాట్లాడుతూ ‘‘కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు మేము ఈ మీటింగ్‌ ఏర్పాటు చేశాం...

Hello Telugu - Sandal Wood

Sandal Wood : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఓ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఎక్కడ చూసిన దీనిపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నటీమణులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోవడంపై పలు చిత్ర పరిశ్రమలు దృష్టి పెట్టాయి. తాజాగా కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆ పరిశ్రమకు చెందిన తారతో మీటింగ్‌ నిర్వహించింది. ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ఎన్‌.ఎం. సురేశ్‌ ఆధ్వర్యలో మీటింగ్‌ జరిగింది.

Sandal Wood Film Industry Meeting..

ఆయన మాట్లాడుతూ ‘‘కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆదేశాల మేరకు మేము ఈ మీటింగ్‌ ఏర్పాటు చేశాం. ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుసుకుని వారి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనేది ఈ మీటింగ్‌లో చర్చించనున్నాం’’ అని అన్నారు. ఏడు సంవత్సరాలు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ రిపోర్ట్‌ రెడీ చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కంచిడీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హేమ కమిటీ రిపోర్ట్‌ ప్రతి ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read : Devara 1 : దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ పోజా…

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com