Election Results: జూన్ 4న సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల ప్రదర్శన !

జూన్ 4న సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల ప్రదర్శన !

Hello Telugu - Election Results

జూన్ 4న సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల ప్రదర్శన !

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఆఖరి (ఏడో) దశ పోలింగ్ ముగియడం ద్వారా మరికొన్ని గంటల్లో ఎన్నికల ఘట్టానికి తెరపడనుంది. ఆఖరి విడత పోలింగ్‌ లో భాగంగా శనివారం కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. దీనితో ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది.

 

జూన్ 4న జరగబోయే ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో జూన్‌ 1న సాయంత్రం పలు న్యూస్ చానెళ్లు, సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతో గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాత జూన్‌ 4న ఫలితాలు కోసం యావత్‌ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. అయితే, ఎన్నికల ఫలితాలు లైవ్‌లోనే బిగ్‌ స్క్రీన్‌పై ప్రసారమైతే..? ఆ అనుభూతి ఎలా ఉంటుంది..? ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ప్లాన్‌ నే అమలు చేయబోతున్నాయి.

 

ముంబైలో ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్,నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్,పుణెలోని మూవీమ్యాక్స్‌, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీమాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తాయి. ఇందుకోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఉదయం 9గంటల నుంచి ఆ థియేటర్‌లలోకి అనుమతిస్తారు. సుమారు 6గంటల పాటు థియేటర్‌లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్‌ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. బిగ్‌ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో చాలా థియేటర్‌లు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. అయితే మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకుని సినిమాహాల్లో ఎన్నికల ఫలితాల ప్రదర్శన మరిన్ని రాష్ట్రాల్లో ఉంటుందని రాజకీయ వర్గాల సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com