Election: సైలంట్ గా ఓటీటీలో ‘ఎలక్షన్‌’ సినిమా ! స్ట్రీమింగ్‌ ఎందులో అంటే ?

సైలంట్ గా ఓటీటీలో 'ఎలక్షన్‌' సినిమా ! స్ట్రీమింగ్‌ ఎందులో అంటే ?

Hello Teugu - Election

Election: తమిళనాడులో ఎన్నికలు, రాజకీయాలు వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన తాజా సినిమా ‘ఎలక్షన్‌’. యంగ్‌ హీరో విజయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించించిన ఈ సినిమాను రీల్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఆదిత్య నిర్మించారు. దర్శకుడు తమిళ్‌ దీనిని ఆశక్తికరంగా తెరకెక్కించాడు. మే 17వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. స్థానిక ఎన్నికల చుట్టూ జరిగే రాజకీయం ఆధారంగా ఈ ‘ఎలక్షన్’ సినిమా తెరకెక్కింది. దీనితో బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Election Movie in OTT

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ‘ఎలక్షన్(Election)’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళ్‌తో పాటు తెలుగు,హిందీ,మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ కుమార్‌తో పాటు ప్రీతి అరసని, జార్జ్ మర్యన్, దిలీపన్ తదితరులు కీలకపాత్రలలో మెప్పించారు.

కోలీవుడ్‌లో ‘సేతుమాన్‌’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్‌ తమిళ్‌ బాగా పాపులర్‌ అయ్యాడు. ఆయన నుంచి సినిమా విడుదల కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఒక వర్గం ప్రేక్షకులకు ఎలక్షన్‌ సినిమా పెద్దగా కనెక్ట్‌ కాలేదనే చెప్పవచ్చు. అలాంటిది అమెజాన్‌ ప్రైమ్‌లో ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. ఓటీటీలో ఈ సినిమాపై ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాల్సి ఉంది.

Also Read : Manchu Vishnu: మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com