Eijaz Khan Thanks : యంగ్ అండ్ డైనమిక్ తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ దూసుకు పోతోంది. రెండు రోజుల్లోనే 234 కోట్లకు పైగా వసూలు చేసింది. సరికొత్త రికార్డును సృష్టించేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , అందాల తార నయనతార, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.
Eijaz Khan Thanks to Jawan Team
ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన డైలాగులు, డైరెక్టర్ ముద్ర , నటీ నటుల పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేస్తున్నాయి. ఈ సందర్బంగా జవాన్ చిత్రంలో తనకు నటించే చాన్స్ ఇచ్చినందుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్.
నా ఆశీస్సులే కాదు ఆ అల్లా దయ మీపై ఎల్లప్పుడు ఉంటుందన్నాడు ఖాన్. మీరు చేసిన మాయాజాలం నన్ను విస్తు పోయేలా చేసిందన్నాడు. మీ విశ్వంలో నన్ను ఒక భాగంగా చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు ఎజాజ్ ఖాన్(Eijaz Khan). మీ ప్రోత్సాహకరమైన మాటలు, నాపై మీరు ఉంచిన నమ్మకం, గడిపిన ప్రతి క్షణం చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు ఎజాజ్ ఖాన్.
ఇదిలా ఉండగా ఇదే ఏడాది షారుక్ ఖాన్ కు ఇది రెండో బిగ్ హిట్ మూవీ. ఆయన దీపికా పదుకొనేతో కలిసి నటించిన పఠాన్ రూ.1,000 కోట్లు సాధించింది. ప్రస్తుతం విడుదలైన జవాన్ ఆ మార్క్ ను కూడా దాటనుందని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : Ameesha Patel : ఖాన్ నటనకు అమీషా ఫిదా