హైదరాబాద్ – ప్రముఖ నటుడు నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈనెల 10న తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఆయన స్వయంగా పబ్ ను నడుపుతున్నారు. ఇటీవల డ్రగ్స్ పట్టుబడడంతో నవదీప్ పేరు ప్రముఖంగా వినిపించింది.
స్వయంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన ప్రకటన చేశారు. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో నవదీప్ పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. ఆ కామెంట్స్ చేసిన వెంటనే నవదీప్ కనిపించకుండా పోయాడని పోలీసులు తెలిపారు.
ఇదే కేసుకు సంబంధించి ఓ నిర్మాతతో పాటు మోడల్ జంప్ అయ్యారు. వారిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు సీవీ ఆనంద్. ఇదిలా ఉండగా తాను ఎక్కడికీ పారి పోలేదని ఇక్కడే నగరంలో ఉన్నానని బహిరంగ ప్రకటన చేశాడు నవదీప్.
ఆ సమయంలోనే తెలివిగా మనోడు హైకోర్టును ఆశ్రయించాడు. తనను ముందస్తు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని. విచారించిన కోర్టు ఈడీ నోటీసులు ఇవ్వవచ్చని కానీ అరెస్ట్ చేయొద్దంటూ వెసులుబాటు ఇచ్చింది.
దీంతో ఈడీ కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి. నవదీప్ గతంలో 2017లో డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నాడు.