Falcon : హైదరాబాద్ – చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టండి అత్యధికంగా ఆదాయం పొందండి అంటూ హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా ఫాల్కన్ ఫైనాన్షియల్ ప్రైవేట్ సంస్థ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. ఏకంగా ఒకటి కాదు రెండు రూ. 1700 కోట్లకు పైగా దేశ వ్యాప్తంగా ఫాల్కన్(Falcon) సంస్థ వసూలు చేసింది.
Falcon Company Scam in HYD
ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ. 850 కోట్లకు పైగా వసూలు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అనంతరం ఫాల్కన్ సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ వసూలు చేసిన డబ్బులను విదేశాలకు మళ్లించినట్లు తేల్చింది.
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ఆర్థిక నేరాలకు అడ్డంగా మారి పోయింది హైదరాబాద్. ఐటీ, లాజిస్టిక్, ఫైనాన్స్, ఫార్మా రంగాలు ఇక్కడ కొలువు తీరాయి. ప్రత్యేకించి ఈ మధ్యన ఆన్ లైన్ వ్యాపారం ఊపందుకోవడంతో పెద్ద ఎత్తున కేటుగాళ్లు, టెక్కీ నిపుణులు, సైబర్ ఎక్స్ పర్ట్స్ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నారు.
ఇప్పటికే పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ లో కేసులు నమోదయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో వేలాది మంది ప్రజల నుంచి చిన్న మొత్తాలుగా సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.
ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా 6979 మంది బాధితుల నుంచి 17 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
బ్రిటానియా, గోద్రెజ్, అమెజాన్ వంటి సంస్థలో పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాల్కన్ అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. ఎప్ఐడీ ఛైర్మన్ అమర్‌దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్ దుబాయ్‌కు పారిపోయారు. వీరిని అరెస్ట్ చేసేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
Also Read : Hero Chiranjeevi Mother :అమ్మ ఆరోగ్యం పదిలం – చిరంజీవి