తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది ఫుల్ బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ రికార్డుల మోత మోగించింది. దీంతో జైలర్ కు సీక్వెల్ గా తనే దర్శకత్వం వహించ బోతున్నాడు. ఇదే విషయాన్ని సన్ పిక్చర్స్ ప్రకటించింది కూడా.
మరో వైపు తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ సినిమాలో ప్రత్యేక రోల్ లో నటిస్తున్నాడు తలైవా రజనీకాంత్. వరుస సినిమాలతో మరింత బిజీగా మారారు సూపర్ స్టార్. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది అగ్ర నటుడి సినిమాకు సంబంధించి.
ప్రస్తుతం రజనీకాంత్ 170వ సినిమా తీస్తున్నాడు. దీనికి జై భీమ్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన టి. జ్ఞాన వేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ట్విట్టర్ వేదికగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు.
తలైవా రజనీకాంత్ కు తోడుగా ప్రముఖ నటి దుషారా విజయన్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. దీంతో ఎవరు నటిగా ఉంటారనే దానిపై తెర దించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మొత్తంగా తన సహజమైన నటనతో ఇప్పటికే ఫుల్ మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన చాన్స్ దక్కడం విశేషం.