Dushara Vijayan: 35 వయసు దాటగానే తన పని విదేశీయానమే అంటున్న దుషారా విజయన్ !

35 వయసు దాటగానే తన పని విదేశీయానమే అంటున్న దుషారా విజయన్ !

Hello Telugu - Dushara Vijayan

Dushara Vijayan: ‘బోదై ఏరి బుద్థి మారి’సినిమా ద్వారా 2019లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నటి దుషారా విజయన్‌. ఆ తరువాత పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ‘సార్పట్టా పరంబరై’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దిండుగల్‌ లోని రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్‌(Dushara Vijayan)… నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. సార్పట్టా పరంబరై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో అవకాశాలు వరుస కట్టాయి. అలాగే ‘నక్షత్రం నగర్గిరదు’, ‘కళువేత్తి మూర్కన్‌’, ‘అనీతి’ వంటి చిత్రాల్లో దుషారా విజయన్‌ నటించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘వేట్టైయాన్‌’, ధనుష్‌ హీరోగా వస్తోన్న ‘రాయన్‌’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Dushara Vijayan Comment

ప్రస్తుతం విక్రమ్‌ సరసన ‘వీర ధీర శూరన్‌’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. చక్కని నటన, అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్‌ అందాల ఆరబోతకు వెనుకాడేది లేదని పలు ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె… ‘రాయన్‌’ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నానన్నారు. ”నేను ధనుష్‌కు వీరాభిమానిని. ఆయనతో కలసి నటించాలన్న చిరకాల కోరిక ‘రాయన్‌’ చిత్రంతో నెరవేరింది. ఈ చిత్రంలో నేను ఉత్తర చెన్నై యువతిగా కనిపిస్తాను. 35 ఏళ్ల వయసు తరువాత నటనకు గుడ్‌బై చెబుతాను. తర్వాత విదేశీయానం చేస్తాను. వెనక్కి తిరిగి చూసుకుంటే తిరగని దేశం ఉండకూడదు’ అని దుషారా విజయన్‌ పేర్కొన్నారు.

Also Read : Tripti Dimri: ధనుష్‌ ప్రియురాలి పాత్రలో యానిమల్ బ్యూటీ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com