Dune Part 2: రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘డ్యూన్ పార్ట్- 2’ !

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'డ్యూన్ పార్ట్- 2' !

Hello Telugu - Dune Part 2

Dune Part 2: లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా ‘డ్యూన్ పార్ట్- 2’. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రలు నటించారు. 2021లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌ గా ఈ ‘డ్యూన్ పార్ట్- 2(Dune Part 2)’ నున తీసుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 4500 కోట్ల వసూళ్లు సాధించింది. 2024లో హాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Dune Part 2 Updates

దీనితో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘డ్యూన్ పార్ట్- 2’ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే కేవలం రెంటల్ విధానంలోనే మాత్రమే ప్రస్తుతానికి ఈ సినిమా అందుబాటులో ఉంది. అంతేకాదు రెంట‌ల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌ తో పాటు బుక్‌ మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Simbu: సుధా కొంగర దర్శకత్వంలో శింబు 50వ సినిమా ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com