Attili Anantaram: ఫేమస్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం మృతి !

ఫేమస్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం మృతి !

Hello Telugu - Attili Anantaram

Attili Anantaram: ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం(Attili Anantaram) శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్‌ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్‌ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్‌ కూడా అందించారు. అమితాబ్, సచిన్‌, మహేశ్‌బాబు వంటి బిగ్‌ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడారు.

Attili Anantaram No More..

నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌(Mumbai) లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్‌ కు మంచి డిమాండ్. దీనితో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్‌లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి.

Also Read : Ramcharan: డాక్టరేట్‌ అందుకున్న రామ్‌చరణ్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com