Dragon : అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం డ్రాగన్ వసూళ్లలో దూసుకు పోతోంది. ఎలాంటి స్టార్లు, సీనియర్లు ఈ చిత్రంలో లేరు. కానీ కంటెంట్ బాగా ఉండడంతో జనం కనెక్ట్ అవుతున్నారు. సినిమాను బ్లాక్ బస్టర్ మూవీగా మార్చేశారు. మొదటి వారాంతంలో అద్బుతమైన బాక్సాఫీస్ ప్రదర్శనను అందించడం విశేషం. మూడు రోజుల్లోనే మొత్తం రూ. 28.5 కోట్లు నికర వసూళ్లు సాధించింది డ్రాగన్(Dragon) చిత్రం.
Dragon Movie Sensational Collections
విడుదలైన తొలి రోజు రూ. 6.5 కోట్లు వసూలు చేస్తే తమిళ వెర్షన్ లో రూ. 5.4 కోట్లు, తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూ. 1.1 కోట్లు వసూలు చేసింది. డ్రాగన్ రెండో రోజు రూ. 10.8 కోట్లు సాధించింది. తమిళ వెర్షన్ లో రూ. 9.05 కోట్లు సాధించగా తెలుగు వెర్షన్ లో రూ. 1.75 కోట్లు ఉండడం విశేషం.
ఆదివారం కూడా డ్రాగన్ మూవీ తన ట్రెండ్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఏకంగా రూ. 11.5 కోట్లు వసూలు చేసింది. సోమవారం కూడా భారీ వసూళ్ల దిశగా సాగింది. తమిళ, తెలుగు వెర్షన్ పై ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. బాక్సాఫీస్ విజయం సాధించేలా ముందుకు సాగుతోంది.
తాజాగా సినిమా ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పారు మూవీ మేకర్స్. ఓటీటీలో విడుదల తేదీ కూడా కన్ ఫర్మ్ చేశారు. ఈ డ్రాగన్ చిత్రం వచ్చే మార్చి 21న స్ట్రీమింగ్ రానుంది. దిగ్గజ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఇంకా సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటించ లేదు.
Also Read : Mad Square Sensational :మ్యాడ్ స్క్వేర్ టీజర్ యమ క్రేజీ