Kayadu Lohar : ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఇన్ స్టా , ఎక్స్ , యూట్యూబ్ , ఇలా ప్రతి దానిలో తమకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు సినీ రంగానికి చెందిన నటీ నటులు. ప్రత్యేకించి హీరోయిన్లు ఈ మధ్యన ఎక్కువగా తమ పేరుతోనే కామెంట్స్ చేస్తూ, ఫోటోలు పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మరో సినీ తార వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు కాయదు లోహర్(Kayadu Lohar). గతంలో తెలుగులో నటించింది. శ్రీవిష్ణుతో కలిసి అల్లూరి మూవీలో అందాలు ఒలికించింది. కానీ వర్కవుట్ కాలేదు.
Kayadu Lohar Success
ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ సినిమాలలో కొన్ని పాత్రలలో తళుక్కుమంది. కానీ ఆశించిన మేర తనకు పేరు రాలేదు. తాజాగా తన లక్ పండింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇది ఊహించని దానికంటే ఎక్కువగా జనాదరణ పొందింది. కాసుల వర్షం కురిపిస్తోంది.
దీంతో గతంలో కనిపించకుండా పోయిన కాయదు లోహర్ ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారి పోయింది. ఎవరీ అమ్మడు ఏమిటా కథ అంటూ గూగుల్ లో , ఇతర సామాజిక మాధ్యమాలలో తెగ వెతుకుతున్నారు.
డ్రాగన్ లో నటించిన లోహర్ కుర్రకారు గుండెలను మీటింది. ఈ చిత్రం విచిత్రంగా బిగ్ సక్సెస్ టాక్ అందుకుంది.
ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగి పోయింది. దీంతో డ్రాగన్ చిత్రానికి సంబంధించి నటీ నటులు కలిసి ఈవెంట్స్ లో పాల్గొంటోంది. అంతే కాదు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా మీమ్స్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. డ్రాగన్ సూపర్ హిట్ కావడంతో తదుపరి తమిళంలో ఇదయం మురళి చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ కావడంతో దానికి కూడా బిగ్ రెస్పాన్స్ రావడం విశేషం.
Also Read : Keerthy Suresh Reject :విశాల్ పెళ్లి ప్రతిపాదన కీర్తి సురేష్ తిరస్కరణ