Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్(Double Ismart)’. గతంలో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. బిగ్ బుల్ పాత్రలో విలన్ గా నటిస్తుండగా… రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌తో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది. ఆదివారం వైజాగ్‌లో జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఒక లెక్క, ఈ ట్రైలర్ ఒక లెక్క అనేలా ఉందీ ట్రైలర్. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Double Ismart Movie Updates
ట్రైలర్ విషయానికి వస్తే… ‘డబుల్ ఇస్మార్ట్(Double Ismart)’ స్టోరీ లైన్ లోని ఒక గ్రిప్పింగ్ గ్లింప్స్ ని అందిస్తుంది. ఎక్సయిటింగ్, హై స్టేక్స్‌తో కూడిన ప్లాట్‌ను ఈ ట్రైలర్ లో రివీల్ చేశారు. బిగ్ బుల్ సంజయ్ దత్ అమరత్వం కోసం ఓ సంచలన ప్రయోగం చేస్తాడు. ‘డబుల్ ఇస్మార్ట్’ బాడీలోకి తన బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం అతని ప్లాన్. ఇదే రెండు బిగ్ డైనమోల మధ్య ఇంటెన్స్ వార్‌కి స్టేజ్‌ని సెట్ చేస్తోంది. దీనితో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ట్రైలర్ అదరగొట్టింది. లవ్ ట్రాక్ యూత్‌ఫుల్ అయితే, మదర్ సెంటిమెంట్ మరో కీ ఎలిమెంట్. అలాగే మూవీలో పూరి ట్రేడ్‌మార్క్ మాస్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. వన్‌లైనర్లు బుల్లెట్‌లా పేలాయి. పూరి టేకింగ్ ఎప్పటిలానే స్టైలిష్‌గా వుంది. సినిమా విజువల్‌గా కేక పెట్టించేలా వుంది. ‘శివలింగం’ వద్ద క్లైమాక్స్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌గా వుంది.
రామ్ డబుల్ ఇస్మార్ట్(Double Ismart) పాత్రలో పీక్ స్టేజ్‌ని సెట్ చేశాడు. తన పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో టైటిల్‌కి తగ్గట్టే డబుల్ ఎనర్జీని తెచ్చారు. సంజయ్ దత్ బిగ్ బుల్‌గా టెర్రిఫిక్‌గా వున్నారు. కావ్య థాపర్ సూపర్-హాట్ గా కనిపించి, రామ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకుంది. ట్రైలర్‌లో సినిమాటోగ్రాఫర్‌లు సామ్ కె నాయుడు, జియాని గియానెలీ ఎక్స్ ట్రార్డినరీ వర్క్‌తో కట్టిపడేశారు.
వారి విజువల్స్ మూవీని డైనమిక్ ఎనర్జీతో నింపితే.. మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఎలివేట్ చేసింది. పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్‌లో వున్నాయి, గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌కి ప్రామిస్ చేస్తున్నట్లుగా ఈ ట్రైలర్‌ని మేకర్స్ కట్ చేశారు. స్టైలిష్ డైరెక్షన్, ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్‌తో డబుల్ ఇస్మార్ట్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Also Read : Prashanth: హీరో ప్రశాంత్ కు రూ.2 వేలు జరిమానా విధించిన చెన్నై పోలీసులు !