Double iSmart: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్(Double iSmart)’. ఈ సినిమా నుండి దిమాకికిరికిరి అప్‌డేట్ వచ్చింది. ఈ బ్లాస్ట్ మాస్ యాక్షన్ ధమాకా ఎంటర్‌టైనర్ టీజర్‌ను మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించి రామ్ కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
Double iSmart Movie Updates
టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో రామ్‌ని ఫేస్ మాస్క్ తో పవర్-ప్యాక్డ్ అవతార్ లో చూపించారు. పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి, ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని ఉన్న రామ్ దిమాకికిరికిరి టీజర్ ని ప్రామిస్ చేసే పోస్టర్ లో ఇంటెన్స్ లుక్‌తో అదరగొడుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నందున… బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్ లతో ముందుకు రానున్నారు.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్… ఈ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఈ సీక్వెల్ లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటున్నారు మేకర్స్. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేకోవర్ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ డబుల్ ఇస్మార్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.
Also Read : Yakshini: బాహుబలి నిర్మాతల సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ ‘యక్షిణి’ !