Double Ismart: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్(Double Ismart)’. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనితో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పూరి జగన్నాథ్ మాస్ డైలాగ్స్ కు రామ్ పోతినేని ఊరమాస్ ఫెర్మామెన్స్ తో ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. దీనితో ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదలైంది. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
Double Ismart Updates
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం అటు పూరి, ఇటు రామ్‌కు ఓ డిఫరెంట్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్… ఈ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
దీనితో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. రామ్ కి ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ మళ్ళీ ఒక మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత రామ్ సినిమాలు అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఇప్పుడు ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంకో పక్క దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో మళ్ళీ విజయం సాధించాలని చూస్తున్నారు. అందుకనే ఈ సినిమాపై దృష్టి పెట్టి ఎలా అయినా మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : Allu Sirish: అల్లు శిరీష్ ‘బడ్డీ’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ !