TTD Tragedy : తిరుమ‌ల‌పై అస‌త్య ప్ర‌చారం బాధాక‌రం

టీటీడీ చైర్మ‌న్ నాయుడు..ఈవో శ్యామ‌ల రావు

TTD : తిరుమ‌ల – తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టిటిడి(TTD) ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. పాలకమండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోంద‌ని, తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని విన్న‌వించారు. తిరుమల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు.

TTD Tragedy..

ఒకరిద్దరు మీడియా, సోషల్ మీడియాలో టిటిడి(TTD) ఛైర్మెన్ కు, ఈవో శ్యామల రావుకు మనస్పర్థలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు. వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామన్నారు.

విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలలో మరింత నాణ్యతగా ఇస్తున్నామ‌న్నారు. తిరుపతిలో జరిగిన తోపులాట సంఘటన జరగడం భాధించిందన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు , తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

ఇప్పటికే 31 మందికి పరిహారం అందించామని, మరో 20 మందికి రెండు మూడు రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు. చిన్న పొరపాట్లు చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తున్నామని తెలిపారు.

టిటిడికి సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని టిటిడి(TTD) ఈవో జె. శ్యామలరావు విన్నవించారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా చేస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు.

టిటిడిలో పాలక మండలిలో చర్చించి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యతన్నారు. టిటిడి ఛైర్మెన్ , ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు, సమన్వయ లోపం అసలు లేదన్నారు. టిటిడి ఛైర్మెన్ ను నేను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు.

సాధారణ భక్తులకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన‌ సూచన మేరకు అమలు చేస్తున్నామన్నారు. గత 6 నెలల కాలంలో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, నెయ్యి సేకరణ, వసతి తదితర సేవలు అందిస్తున్నామన్నారు.

టిటిడిలో దళారి వ్యవస్థను పూర్తిగా కట్టడి చేస్తున్నామని, ఆన్ లైన్ లో మోసాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా టిటిడి విజిలెన్స్ విభాగం గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టిటిడిలో విజన్ డాక్యుమెంట్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన సందర్భాలలో వివిధ రంగాల నిపుణుల సూచనలు, సహకారం తీసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు టిటిడి ఈవో మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, కంపార్ట్మెంట్ల నిర్వహణ, వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, తదితర అంశాలు పూర్తిగా టిటిడి పరిధిలో ఉంటుందన్నారు,

తిరుపతిలో జన రద్దీని ఎలా అదుపు చేయాలి, జన రద్దీ నిర్వహణ, క్యూలైన్ మేనేజ్మెంట్ , భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎన్ని ఏర్పాటు చేయాలి, వాటి పటిష్టత ఎంత ఉండాలనే అంశాలు పూర్తిగా జిల్లా మేజిస్ట్రేట్ , జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటుందన్నారు.

వారి సూచనల మేరకు టిటిడి ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకుని, వారి సూచనల మేరకు టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఎక్కడైనా జన రద్దీని పూర్తిగా అదుపు చేయాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ చేతిలో ఉంటుందన్నారు. భక్తుల తోపులాట అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరుగుతోందని, న్యాయ విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు.

Also Read : Hardik- Beauty Janhvi : హార్దిక్ పాండ్యా జాహ్న‌వి క‌పూర్ డేటింగ్..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com