న్యూయార్క్ – బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలివుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది ప్రియాంక చోప్రా. తాజాగా న్యూయార్క్ నగరంలో సందడి చేసింది. డీకేఎంఎస్ లో రెడ్ కార్పెట్ ను సొంతం చేసుకుంది. గాలాకు చోప్రాతో పాటు పలువురు ముద్దుగుమ్మలు హాజరయ్యారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నగరంలోని సిప్రియాని వాల్ స్ట్రీట్ లో ఈ వేడుక చోటు చేసుకుంది. బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు గాను డీకేఎంఎస్ స్వచ్చంధ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మానవతా దృక్పథంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి తను కూడా తోడ్పాటు అందిస్తున్నారు నటి ప్రియాంక చోప్రా.
తన కంటే చిన్న వాడైన గాయకుడు నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది. అమెరికాలోనే స్థిర పడింది. ఫుల్ బిజీగా మారింది. ఇటీవల తన సోదరి పరిణీతి చోప్రా వివాహానికి కూడా హాజరు కాలేక పోయింది. బిజీగా ఉండడంతో తనకు వచ్చేందుకు కుదర లేదని పేర్కొందది ప్రియాంక చోప్రా.
ఈ కార్యక్రమానికి ప్రియాంక చోప్రాతో పాటు కూతురు మాల్తీ మేరీతో కలిసి సందడి చేయడంతో కెమెరాలు క్లిక్ మనిపించాయి. మొత్తంగా కొత్త డ్రెస్ తో మరోసారి మెరిసింది. అందరినీ తన వైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.