డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న దిశా ప‌టానీ

ఫౌజీ మూవీలో మాన్వితో పాటు త‌ను

ప్యాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. వ‌రుస సినిమాల‌లో త‌ను కీ రోల్ పోషిస్తుండ‌డం విశేషం. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా సాబ్ షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. మ‌రో వైపు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి మూవీ సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. ఇంకో వైపు ఫౌజీ చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ మ‌రోసారి ప్ర‌భాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంద‌ని స‌మాచారం.

త‌ను క‌ల్కి 2898 ఏడీ చిత్రంలో న‌టించింది. ఈ మూవీ దేశ వ్యాప్తంగా దుమ్ము రేపింది. బాక్సుల వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. రూ. 1000 కోట్ల‌కు పైగా సాధించింది. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సీక్వెల్ పై క‌న్నేశారు. ప్ర‌భాస్ వ‌రుస మూవీస్ చేస్తుండ‌డంతో ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు త‌న నుంచి వ‌చ్చే మూవీస్ కోసం. వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ క‌న్ ఫ‌ర్మ్ చేశాడు. ఇందుకు సంబంధించి పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశాడు డైరెక్ట‌ర్.

ఇక ఫౌజీ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు హ‌నుమ రాఘ‌వ‌పూడి. దీనికి తాత్కాలికంగా పేరు పెట్టినా ఆ త‌ర్వాత మ‌రో పేరు పెట్టే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఇన్ ఫ్లూయ‌న్స‌ర్ గా పేరొందిన ఇమాన్వీని ఎంచుకున్నాడు డైరెక్ట‌ర్. ఇక క‌థా ప‌రంగా మ‌రో కీల‌క పాత్ర ఉంద‌ని, దాని కోసం దిశా ప‌టానీ అయితేనే స‌రిగ్గా స‌రి పోతుంద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడ‌ని, ఇదే విష‌యాన్ని త‌న‌కు కూడా చెప్పార‌ని, ఆమె ఒక్క మాట మాట్లాడ‌కుండానే ఓకే చెప్పిన‌ట్లు సినీ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎందుకంటే ప్ర‌భాస్ రేంజ్ వేరు. త‌న‌తో న‌టిస్తే చాలు ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని న‌మ్మ‌కం.
కాగా దిశా ప‌టానీ డార్లింగ్ తో న‌టిస్తుందా అనే విష‌యంపై ఇంకా మూవీ మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ లేదు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com