లోఫర్ లో నటించి కళ్లతో కాటేసేలా చేసిన ప్రముఖ నటి దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ప్రస్తుతం తను పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు నాగ్ అశ్విన్. గతంలో తను మహానటి తీశాడు. కొత్త చిత్రం ప్రాజెక్ట్ కె. ఇందులో దిశా పటానీతో పాటు దీపికా పదుకొనే కూడా నటిస్తోంది. దీనికి నిర్మాత అశ్వనీ దత్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో బిజీగా పాల్గొంటోంది నటి దిశా పటానీ. షూటింగ్ లో కొంచెం విరామం దొరకడంతో ఓ ఛానల్ తో ముచ్చటించింది. తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది లవ్లీ గర్ల్.
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. లక్నోలో చదువుకుంటున్న సమయంలో నా ఫ్రెండ్ ఫోటో ఓ మోడల్ పోటీలకు పంపించింది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. లోఫర్ పేరు తీసుకు వచ్చేలా చేసింది.
ప్రస్తుతం ప్రాజెక్టు కె పైనే తాను ఎక్కువగా ఫోకస్ పెట్టానని చెప్పింది దిశా పటానీ. ఇదే సమయంలో తాను సినిమాలో నటించేంత వరకే ప్రయారిటీ ఇస్తానని, ఆ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది పట్టించు కోనంటూ స్పష్టం చేసింది.