Directors Day-దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న హైదరాబాద్‌లోని ఎల్.బి.స్టేడియంలో డైరెక్టర్స్ డే వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు తెలుగు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. ఈ వేడుకకు సంబందించి సోమవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పలువురు టాలీవుడ్ దర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా టీఎఫ్‌డీఎ.ఇన్ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలుగు సినిమా దర్శకుల సంఘం పూర్వ అధ్యక్షుడు ఎన్.శంకర్, ప్రస్తుత అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ… ‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం… తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు(Dasari Nayanarao). ఆయన పేరు మీదే డైరెక్టర్స్ డే చేయాలనుకున్నాం. అందరి సహకారంతో ఐదేళ్లుగా జరుపుతున్నాం. ఈసారి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పరిశ్రమనంతా కలుపుకుని ఆ వేడుకల్ని నిర్వహిస్తున్నాం’’ అన్నారు
Directors Day – దర్శకుల సంఘంకు ప్రభాస్ విరాళం రూ. 35 లక్షలు
దర్శకుల సంఘం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం అగ్ర కథానాయకుడు ప్రభాస్ రూ. 35 లక్షలు విరాళం ప్రకటించినట్టు దర్శకుడు మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, హరీశ్‌శంకర్, రామ్‌ప్రసాద్, వి.ఎన్.ఆదిత్య, రాజా వన్నెంరెడ్డి, సముద్ర, దశరథ్‌తోపాటు పలువురు యువ దర్శకులు పాల్గొన్నారు.
Also Read : Bollywood Sucessful Pairs: బాలీవుడ్ హిట్ పెయిర్స్ మళ్లీ రిపీట్ !