Vignesh Shivan : తన ఎక్స్ అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త విఘ్నేష్ శివన్

అయితే విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ఖాతాను డెలీట్ చేయడానికి ఓ కారణం ఉందట...

Hello Telugu - Vignesh Shivan

Vignesh Shivan : గతకొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న తన డాక్యూమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానుమ్ రౌడీ సినిమా నుంచి కొన్ని క్లిప్స్ వాడుకుంది నయన్. దీంతో తన అనుమతి లేకుండానే వీడియో క్లిప్స్ వాడడంపై లీగల్ నోటీసులు పంపించాడు ధనుష్. దీంతో అతడి తీరుపై నయన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మూడు సెకన్ల వీడియో వాడినందుకు మొత్తం రూ.10 కోట్లు చెల్లించాలని ధనుష్ డిమాండ్ చేయడంపై సోషల్ మీడియాలో నయనతారతోపాటు.. ఆమె భర్త విఘ్నేష్ శివన్ సైతం తీవ్రంగా విమర్శించాడు. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నయన్ భర్త విఘ్నేష్(Vignesh Shivan) ఊహించని షాకిచ్చారు. తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారు.

Vignesh Shivan X Account..

అయితే విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ఖాతాను డెలీట్ చేయడానికి ఓ కారణం ఉందట. ఇటీవల పాన్ ఇండియా డైరెక్టర్ల రౌండ్ టేబుల్ చర్చలో భాగమయ్యాడు విఘ్నేష్. అప్పుడు ధనుష్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాగే తన సినిమాలపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో తెరకెక్కించిన కాతువాకుల రెండు కాదల్ సినిమా పై సైతం ట్రోల్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు రూపొందిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పాన్ ఇండియా లెవల్ కు సరిపోదని విమర్శలు కురిపించారు. దీంతో మానసికంగా బాధపడిన విఘ్నేష్ తన ట్విట్టర్ ఖాతా డెలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై విఘ్నేష్ స్పందించలేదు. ప్రస్తుతం నయన్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఓవైపు తన కొడుకులతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లైఫ్ ఇన్సురెన్స్ సినిమాను రూపొందిస్తున్నారు. అలాగే ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుభేర చిత్రంలో నటిస్తున్నాడు.

Also Read : Aishwarya Lekshmi : తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన నటి ఐశ్వర్య లక్ష్మి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com