Vamshi Paidipally : ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ(Vamshi Paidipally) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మాణ సారథ్యంలో మినిమం గ్యారెంటీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ఈ చిత్రం విచిత్రంగా రూ. 300 కోట్లను దాటేసింది. దీనిని అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్ తమ ఎక్స్ అధికారిక హ్యాండిల్ లో.
Vamshi Paidipally Praises..
ఘన విజయం సాధించడంతో చిత్ర బృందం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దర్శకులు పైడిపల్లి వంశీ, రాఘవేంద్ర రావు. సురేష్ ప్రొడక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. వాళ్లు కథలకు ప్రాధాన్యత ఇస్తారని, మంచి కథ వుంటే చాలు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని కొనియాడారు.
వారు చేసిన పుణ్య ఫలమే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయానికి కారణమైందన్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు పైడిపల్లి వంశీ. తాను చిన్నప్పటి నుంచి వెంకీ సినిమాలు చూస్తూ పెరిగానని, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనదంటూ ప్రశంసించారు. తాను కూడా ఎప్పుడైనా ఓ మూవీ చేయాలని తనతో ఉందన్నారు.
ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆకాశానికి ఎత్తేశాడు. వాడు తనకు తమ్ముడు లాంటోడని పేర్కొన్నాడు వంశీ.
Also Read : మీనాక్షి చౌదరి సొగసు చూడతరమా