Director Tharun Sudhir: రెండు సంప్రదాయాల్లో కన్నడ దర్శకుడు, హీరోయిన్‌ ల పెళ్లి !

రెండు సంప్రదాయాల్లో కన్నడ దర్శకుడు, హీరోయిన్‌ ల పెళ్లి !

Hello Telugu - Director Tharun Sudhir

Director Tharun Sudhir: ప్రముఖ కన్నడ దర్శకుడు తరుణ్‌ సుధీర్‌, నటి సోనల్‌ రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఆగష్టు 11న బెంగళూరు పూర్ణిమ ప్యాలెస్‌ లో హిందూ సంప్రదాయంలో వారు పెళ్లి చేసుకున్నారు. సిని ప్రముఖలతో పాటు ఇరువైపుల కుటుంబసభ్యుల సమీక్షంలో జంట ఒక్కటయ్యారు. మంత్ర ఘోషణల మధ్య తరుణ్‌ సోనల్‌ కు తాళి కట్టాడు. హీరో దర్శన్‌ తో కాటేరా సినిమాను తెరకెక్కించి తెలుగు వారికి కూడా ఆయన పరిచయం అయ్యారు.

Director Tharun Sudhir Marriage

తరుణ్‌ సుధీర్‌ సతీమణి నటి సోనల్‌ సూచన మేరకు మంగళూరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్‌ 2న మరోసారి వివాహం చేసుకున్నారు. మంగళూరు చర్చిలో ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వారి వివాహాన్ని సంబరంగా చేసుకున్నారు. నూతన జంటకు సినీ, టీవీ రంగాల నటీనటులు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

Also Read : Balakrishna : ఇరు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన బాలయ్య

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com