Director Sukumar : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పై ప్రశంసలు కురిపించిన సుకుమార్

ఈ కార్యక్రమంలో డైరెక్ట‌ర్‌ సుకుమార్ మాట్లాడుతూ....

Hello Telugu - Director Sukumar

Director Sukumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమా జనవరి 10న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్(Director Sukumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Director Sukumar Comment

ఈ కార్యక్రమంలో డైరెక్ట‌ర్‌ సుకుమార్(Director Sukumar) మాట్లాడుతూ.. ‘‘ఓవర్సీస్ ఆడియెన్స్ తెలుగు సినిమాలని ఎక్కువగా ఆదరిస్తుంటారు. ‘1 నేనొక్కడినే’ మూవీని ఇక్కడి ఆడియెన్స్ ఆదరించి ఉండకపోతే నాకు నెక్ట్స్ సినిమాలు వచ్చేవి కావు. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. చిరంజీవిగారు ఎందుకు శంకర్ గారితో సినిమా చేయలేదు.. శంకర్ గారు ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునేవాళ్లం. కానీ శంకర్ గారితో రామ్ చరణ్ సినిమా అని తెలియడంతో చాలా ఆనంద పడ్డాను.

ఈ విషయాన్ని రామ్ చరణ్ మొదటగా నాకే చెప్పినట్టున్నాడు. సూర్య తీసిన ‘ఖుషి’ నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశా. ‘ఖుషి’ సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నాను. అంజలి మా ఊరు అమ్మాయి. చాలా బాగా నటించారు. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు. కానీ అది నేను వాడుకోలేకపోయాను. ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోని ఎక్కువగా ప్రేమిస్తాను. ‘రంగస్థలం’ అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్‌తో మాత్రమే కొనసాగింది. రామ్ చరణ్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. చిరంజీవిగారితో కలిసే ఈ ‘గేమ్ చేంజర్(Game Changer)’ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్. ‘జెంటిల్మెన్, భారతీయుడు’ చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. ఇక ‘గేమ్ చేంజర్‌’ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. శంకర్ గారి సినిమాలు చూస్తూ మేం పెరిగాం. పిఠాపురంలో పూర్ణ థియేటర్లో భారతీయుడు సినిమా చూశాను. కమర్షియల్ యాంగిల్స్‌లో సినిమా తీయడంలో శంకర్ గారు గ్రేట్. ఆయనలా ఇంకెవ్వరూ తీయలేరు. ‘గేమ్ చేంజర్‌’లో ఓ నాలుగు సీన్స్ చూశాను. అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ గారు నన్ను బాగా అర్థం చేసుకుంటారు. నేను సమస్యలని చెప్పకపోయినా ఆయన అర్థం చేసుకుంటారు. మా గురువు గారిని దిల్ రాజు గారు డైరెక్టర్‌ని చేశారు. ‘గేమ్ చేంజర్’ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ ఇంటిపై దాడికి భగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com