Sukumar : క్రియేటివ్ డైనమిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు సుకుమార్. తను ఒకప్పుడు లెక్చరర్ గా పని చేశాడు. బన్నీతో తీసిన ఆర్య సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా తను తీసిన పుష్ప 2 దుమ్ము రేపింది. వరల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. రికార్డ్ సృష్టించింది. సినిమా సక్సెస్ చేసినందుకు సుకుమార్(Sukumar) చిట్ చాట్ చేశాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను లేకుండా నేను సినిమా తీయలేనమోనని అన్నాడు. అతడు ఎవరో కాదు ఇండియన్ రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.
Sukumar Express..
వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ డూపర్ సాంగ్స్ వచ్చాయి. మూవీస్ కూడా బంపర్ హిట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని కితాబిచ్చాడు. తనతో ఉంటే హాయిగా ఉంటుందన్నాడు. సెట్స్ లో కథ గురించి ఒక్కసారి చెబితే చాలు ఎక్కడ ఉన్నా సరే తక్షణమే రెండు మూడు రకాల ట్యూన్స్ ఇచ్చేస్తాడని చెప్పాడు సుకుమార్.
ఒక రకంగా తాను ఎప్పుడూ అనుకుంటానని నా పేరుతో పాటు దేవిశ్రీ పేరును కూడా తగిలిచ్చుకుంటే బాగుంటుందని . తమ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్నీ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయని తెలిపాడు. మెలోడీస్, స్పెషల్ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయని తెలిపాడు.
తామిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తోందన్నాడు. ఆర్య, జగడం, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప2 మూవీస్ జర్నీతో మా ఇద్దరి మధ్య బంధం మరింత గట్టి పడిందన్నాడు. ఇక బన్నీతో కూడా నా బంధం బలంగా ఉందన్నాడు. నటనలో తనను ఎస్వీ రంగారావుతో పోల్చాడు సుకుమార్.
Also Read : Hero Prabhas-Brahma-Anandam :బ్రహ్మ ఆనందంకు ‘డార్లింగ్..మెగా’ సపోర్ట్