Director Shankar : దర్శకుడు శంకర్ చిన్న కూతురు రెండో పెళ్లికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. శంకర్ చిన్న కూతురు ఐశ్వర్య శంకర్ నిశ్చితార్థం ఆదివారం జరిగింది. శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్ ను అల్లుడ్ని చేసుకున్నారు. శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే తరుణ్‌ని ఐశ్వర్య ప్రేమిస్తుంది. ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది. ఐశ్వర్య, తరుణ్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అదితి శంకర్ షేర్ చేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
Director Shankar Daughter Engagement Photos Viral
ఐశ్వర్య శంకర్ ఇటీవల తన మొదటి భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోవడానికి కారణం స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పుడు తరుణ్‌లో ఐశ్వర్యకు మళ్లీ ప్రేమ దొరికింది. అసిస్టెంట్‌గా వచ్చిన తరుణ్ తన అల్లుడు ఎలా అయ్యాడనే దానిపై ఆన్‌లైన్‌లో కొన్ని ఫన్నీ కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.
శంకర్(Shankar) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న శంకర్ ఇంకా గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌లు కూడా విడుదల చేయకపోవడంపై రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య మొదటి భర్త రోహిత్‌ను కొన్ని రోజుల క్రితం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఐశ్వర్య విడాకులు తీసుకుందని అందరూ అనుకుంటున్నారు.
Also Read : Ooru Peru Bhairavakona : బ్రేక్ ఈవెన్ ను అందుకున్న ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా