Rajinikanth : ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది అభిమానులు కలిగిన సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. త్వరలోనే రజనీకాంత్(Rajinikanth) జీవిత చరిత్రకు సంబంధించి బయోపిక్ తీస్తానని ప్రకటించారు.
Director Shankar-Rajinikanth Movie Updates
భారత దేశ సినీ చరిత్రలో మోస్ట్ పాపులర్ దర్శకుడిగా గుర్తింపు పొందారు శంకర్. ఆయన సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. భారీ తనం ఉండేలా జాగ్రత్త పడతారు. అంతే కాదు ప్రతీ సినిమాలో ఓ సామాజిక సందేశం ఉండేలా చూస్తాడు దర్శకుడు. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సులు బద్దలు కొట్టేలా చేసింది.
తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ తీశాడు. ఇది పూర్తిగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ గ్యాప్ తో వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు.
మూవీ విడుదల సందర్బంగా శంకర్ చిట్ చాట్ చేశారు. సినిమా రంగంలో విమర్శలు సహజమేనని అన్నారు. తాను వాటి గురించి పట్టించుకోనంటూ చెప్పారు. ప్రతి దానిని తాను సవాల్ గా తీసుకుంటానని, సవాళ్లను స్వీకరించడం తనకు అత్యంత ఇష్టమన్నారు. తన సినీ కెరీర్ లో రజనీకాంత్ తో బయోపిక్ తీయాలని ఉందన్నాడు. ఎందుకంటే తన జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయంగా ఉంటుందన్నాడు.
Also Read : CM-TTD Tragedy : సేవా భావం ముఖ్యం రాజకీయం చేస్తే సహించం