Director Shankar : భారతీయ సినీ రంగంలో మోస్ట్ టాలెంటెడ్, డైనమిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు తమిళ సినీ రంగానికి చెందిన శంకర్. తన రెమ్యూనరేషన్ ఏకంగా రూ. 60 నుంచి రూ. 90 కోట్ల దాకా ఉంటుందని ట్రేడ్ వర్గాల బోగట్టా. తన టేకింగ్, మేకింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. తను 1996లో లోక నాయకుడు కమల్ హాసన్ తో తీసిన భారతీయుడు (ఇండియన్ ) ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Director Shankar – People are Waiting for his Movie
దాదాపు 27 ఏళ్లు అయినా అది చెక్కు చెదర లేదు. కారణం ఇంకా ఈ దేశంలో 75 ఏళ్ల పాటు స్వేచ్ఛ లభించినా అవినీతి కొనసాగుతూనే ఉంది. ఆక్టోపస్ లో విస్తరించి ఉంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ లో నటించి మెప్పించిన రామ్ చరణ్ తో దిల్ రాజు అత్యంత ప్రతిస్టాత్మకంగా శంకర్(Director Shankar) సినిమా తీస్తున్నాడు. షూటింగ్ వీర లెవల్లో ఉంది. ఇప్పటికే శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే సమయంలో నాయకన్ -2 తీస్తున్నాడు శంకర్. ఇందులో ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కానీ భారతీయుడుకు అల్లా రఖా రెహమాన్ సంగీతం అందిస్తే..తాజాగా సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ -2 కు మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. మొత్తంగా శంకర్ మరోసారి హాట్ టాపిక్ గా మారడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదే సమయంలో లోక నాయకుడు కమల్ హాసన్ శంకర్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశాడు.
Also Read : Varun Lavanya Video : ఓటీటీలో ఆ జంట పెళ్లి వీడియో