Director Sankar: సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది ఇప్పుడు చాలా సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ కాపీ క్యాట్ లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా తాను హక్కులు పొందిన ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడేశారని ప్రముఖ దర్శకుడు శంకర్(Director Sankar) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కాపీ రైట్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్)లో శంకర్ ఓ పోస్ట్ పెట్టారు.
‘ముఖ్య గమనిక ! వెంకటేశన్ రాసిన తమిళ నవల వీర యుగ నాయగన్ వేళ్ కాపీరైట్స్ నావే.. నా అనుమతి లేకుండా చాలా సినిమాల్లో ఈ నవలలోని కీలక సన్నివేశాలను ఇష్టానుసారం వాడేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ సినిమా ట్రైలర్ లోనూ ఓ ముఖ్యమైన సీన్ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్… ఇలా ఏ ఇతర ప్లాట్‌ఫామ్ లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీ రైట్స్ ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని తన ఎక్స్ వేదిగా హెచ్చరించారు.
ఇది చూసిన నెటిజన్లు ఇంతకీ నవలను కాపీ కొట్టిన సినిమా ట్రైలర్ ఏదో చెప్పి ఉండాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న శంకర్(Director Sankar) ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్, కియారా అద్వాణీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్‌కు గురయ్యారు.
Director Sankar – ఎన్టీఆర్ ‘దేవర’ గురించే శంకర్ కామెంట్ ?
దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్ గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్(Director Sankar) ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట.
Also Read : Producer Ravi Shankar: జానీ మాస్టర్ వివాదంపై స్పందించిన ‘పుష్ప’ నిర్మాత !