Laila : ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. గతంలో హీరో హీరోయిన్ల ఆధారంగా సినిమాలను ఆదరించే వారు. కానీ సీన్ మారింది. టెక్నాలజీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కథకు ప్రయారిటీ ఇస్తున్నారు. కంటెంట్ లో దమ్ముంటే చాలు సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ప్రత్యేకించి ఈ మధ్యన కామెడీని ఆశిస్తున్నారు. రొమాంటిక్ ప్రధానాంశంగా తెరకెక్కించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
Laila Movie Updates
తాజాగా సంక్రాంతి పండుగ సందర్బంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్ ను దాటేసింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బోల్తా పడింది. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
తాజాగా లైలా(Laila) మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తిగా ఎంటర్ టైనర్, రొమాంటిక్ ఉండేలా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు సాహు గారపాటి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. లైలాకు ప్రాణం పెట్టి నటించాడు నటుడు విశ్వక్ సేన్ . తను రెండు పాత్రలలో జీవించాడని కితాబు ఇచ్చాడు. ఈ సినిమా పక్కా వినోద ప్రధానంశంగా తీశామన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ , పోస్టర్స్ కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
Also Read : Pushpa 2 Success : పుష్ప2 విజయం అభిమానులకు అంకితం