Director RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తెలంగాణా హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. గతంలో ‘వ్యూహం’ సినిమాను జనవరి 11 వరకు విడుదల చేయడానికి వీల్లేదంటూ బ్రేకులు వేసిన హైకోర్టు… తాజాగా ఆ తీర్పుపై సవాల్ చేసిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కు షాక్ ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూనే… నష్టాల గురించి అక్కడే తేల్చుకోవాలని సూచించింది. దీనితో ‘వ్యూహం’ సినిమా విడుదల చేయడం ఎవ్వరి తరం కాదు అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన సవాల్ కు కోర్టు తీర్పులు చెంప పెట్టులా కనిపిస్తున్నాయి.
Director RGV – అసలు ఏం జరిగిందంటే ?
‘వ్యూహం’ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన తెలంగాణా హై కోర్టు… సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదంటూ సినిమా విడుదలకు బ్రేకులు వేసింది. ఈ మేరకు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికేట్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
దీనితో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వలన తన సినిమా విడుదల నిలిచిపోయిందని, అందువలన కోట్లలో నష్టం వస్తోందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే సింగిల్ బెంచి తదుపరి విచారణని ఈనెల 11కి వేసిందని కూడా తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు(High Court) సింగిల్ బెంచీ తీర్పును సమర్థించడమే కాకుండా ఈ నష్టాల గురించిన అన్ని విషయాలు అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్ కి స్పష్టం చేసింది. దీనితో వ్యూహం సినిమా ఇప్పట్లో విడుదలయ్యేటట్లు కనిపించడం లేదు.
రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV) తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు ఏపి సిఎం వైఎస్ జగన్ కు సంబందించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపిస్తున్నట్లు దర్శకుడు రాం గోపాల్ వర్మ(RGV) గతంలో చెప్పడం జరిగింది. డిసెంబరు 29న సినిమాని విడుదల చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. అంతేకాదు జనవరి నెలలో వ్యూహం కి కొనసాగింపు గా “శపథం ” అనే సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో… టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించ పరిచే విదంగా ఉన్నాయంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హై కోర్టును ఆశ్రయించారు. లోకేష్ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన తెలంగాణా హై కోర్టు… సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదంటూ సినిమా విడుదలకు బ్రేకులు వేసింది. ఈ మేరకు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికేట్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
Also Read : Hero Dhanush: స్టార్ హీరో ఈవెంట్ లో యాంకర్ కు తప్పని వేధింపులు !