Maruthi : డార్లింగ్ ప్రభాస్ నటించిన చిత్రం రాజా సాబ్ పై ఆసక్తికర అప్ డేట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు మారుతి. తనకు మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా పేరుంది. పూర్తిగా రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఇప్పటికే సినిమా పోస్టర్స్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ ను పూర్తిగా లవర్ గా చూపించాడు. సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తను ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అయితే ఇంకా విడుదల చేయక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆందోళన పట్ల స్పందించాడు డైరెక్టర్ మారుతి(Maruthi).
Director Maruthi Comment
సినిమా దాదాపు పూర్తి కావచ్చిందని, వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అందుకే ఆలస్యం అవుతోందని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించాడు. సినిమా అంటే దర్శకుడు, నటీనటులు కాదని, ఇతర సాంకేతిక నిపుణులు కూడా ఉంటారని తెలుసుకుంటే మంచిదని హితవు పలికాడు. డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తాము సినిమా తీయాల్సి ఉంటుందని, అన్నింటిని జాగ్రత్తగా పరీక్షించుకున్న తర్వాతే రాజా సాబ్ ను విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేశాడు మారుతి.
ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే తను సినిమా కథపై ఎక్కువగా ఫోకస్ పెడతాడు. టేకింగ్, మేకింగ్ లో ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడతాడు. 2005లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తను మంచి చదువరి. పాఠకుడు కూడా. దర్శకుడు, నిర్మాత, రచయితగా పేరొందాడు. తనది మచిలీపట్నం. పేద కుటుంబం నుంచి వచ్చాడు. తన తండ్రి బండ్ల మీద అరటిపళ్లు అమ్మే వాడు. తల్లి టైలర్. తను వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. ఆ తర్వాత కష్టాల కడలి మధ్య సినిమాల్లోకి వచ్చాడు మారుతి. ఏది ఏమైనా రాజా సాబ్ పై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది.
Also Read : Hero Nani-Hit 3 Song :నాని జోరు ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ జోష్