Maruthi : డార్లింగ్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా తీస్తున్న దర్శకుడు మారుతి(Maruthi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటారని, కానీ ఫెయిల్యూర్ ను మాత్రం ఇష్ట పడరన్నారు. కానీ తనకు మాత్రం అపజయం అనే దానిని సానుకూలంగా తీసుకుంటానని చెప్పాడు. విజయం కొంత కాలం మాత్రమే గుర్తుండి పోతుందని, కానీ అపజయం జీవితాంతం నెమరు వేసుకునేలా చేస్తుందన్నాడు. చిట్ చాట్ సందర్బంగా తన అనుభవాలను పంచుకున్నాడు.
Director Maruthi Comment about Success
ఈ రోజుల్లో, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు సినిమాలు తీసినా ప్రతి మూవీలో ఏదో ఒక మెస్సేజ్ ఉండేలా చూశానని చెప్పాడు మారుతి. ఇదే సమయంలో తాను తీయబోయే ప్రతి సినిమా గురించిన కథను ముందుగా అల్లు అర్జున్ కు తెలియ చేస్తానని అన్నాడు. చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు.
రాజా సాబ్ కంటే ముందే చిరంజీవితో సినిమా తీయాల్సి ఉందన్నాడు. కానీ కథ ఫస్టాఫ్ మాత్రమే బాగుందని, సెకాండఫ్ వర్కవుట్ కాలేదని అందుకే కొంత ఆలస్యం ఏర్పడిందన్నాడు. తన ఫోకస్ అంతా సినిమా మీదే ఉంటుందన్నాడు. తాను తీసిన సినిమాలతో పాటు ఇతర మూవీస్ ను కూడా చూస్తూ ఉంటానని , అలా చూస్తున్నప్పుడు తాను చేసిన తప్పులు ఏమిటో తెలుస్తాయని అన్నాడు. రాజా సాబ్ లో ప్రభాస్ ను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నానంటూ చెప్పాడు మారుతి.
Also Read : ఫెయిల్యూర్ నాకు కిక్ ఇస్తుంది