Director KR: ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం… ఈ సినిమా తోనే…

ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం... ఈ సినిమా తోనే...

Hello Telugu - Director KR

Director KR: ప్రముఖ దర్శక నిర్మాత కె. రాజన్ (కేఆర్)… ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఆఫర్ ప్రకటించారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఆయిరం పొర్కాసుగల్‌’ సినిమాకు ఒక టిక్కెట్టు కొంటే మరొక టిక్కెట్టు ఉచితం అనే ఆఫర్‌ ను ప్రకటించారు. విదార్థ్‌ శరవణన్‌ – అరుంధతి నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై… పాజిటివ్ టాక్ ను సంపాదించింది. పెద్ద హీరోలు నటించిన సినిమాకు మాత్రమే ఆదరణ లభించడంతో… చిన్న సినిమాలకు ప్రేక్షకులను రప్పించేందుకు ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

దీనితో దర్శక నిర్మాత కె.రాజన్(K Rajan) నిర్ణయాన్ని కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్‌ అభినందించారు. ‘తమిళ చిత్ర పరిశ్రమ కొత్త ఆవిష్కరణలు, విప్లవాత్మక మార్పులు చేయడంలో ఎల్లవేళలా ముందుంటుంది. ఈ ఆఫర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. ఈ ప్రయోగం విజయవంతం అయితే మరికొన్ని చిన్న చిత్రాలకు ఎంతగానో దోహదపడుతుంది. అందువల్ల ఈ కాన్సెప్టును మరింత ఎంకరేజ్‌ చేయాలని కోరుతున్నా’ అని ఈ సందర్భంగా కమల్ హాసన్ పేర్కొన్నారు.

Director KR – ‘ఆయిరం పొర్కాసుగల్‌’ సినిమా నుండి శ్రీకారం

‘బై వన్‌ టికెట్.. గెట్‌ వన్‌ ఫ్రీ’ ఆఫర్ గురించి చిత్ర దర్శకనిర్మాత కేఆర్(KR) మాట్లాడుతూ… ఒక సినిమా తలరాతను నిర్ణయించేది మొదటి రోజు మొదటి ఆట. ఇటీవల భారీ బడ్జెట్‌ చిత్రాలు వ్యాపారపరంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. కానీ, మంచి కథలతో వచ్చే చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. చిన్న బడ్జెట్‌ చిత్రాలు నిర్మించవద్దని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేదు. అందుకే ఏదో ఒకటి చేసి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ‘బై వన్‌ గెట్‌ వన్‌ ఫ్రీ’ మూవీ టిక్కెట్‌ ఆఫర్‌.

పెద్ద చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడం సంతోషంగా ఉన్నప్పటికీ… చిన్న చిత్రాలకు ఆదరణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. ఇప్పుడున్న అగ్ర నటీనటులు, టెక్నీషియన్లు ఒకప్పుడు చిన్న చిత్రాల్లో నటించి తమ కెరీర్‌ను ప్రారంభించినవారే. అందుకే చిన్న బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలను ప్రోత్సహించేలా ఈ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్‌ యజమానులతో నాకు మంచి స్నేహసంబంధాలున్నాయి. వారంతా ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచారు. ఈ విధానానికి నేను నిర్మించిన ‘ఆయిరం పొర్కాసుగల్‌’ చిత్రంతోనే శ్రీకారం చుడుతున్నానని ఆయన అన్నారు.

Also Read : Jigarthanda Double X: రోటర్‌డ్యామ్‌ ఫెస్టివల్‌కు ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com