Kabir Khan : ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ వైరల్ గా మారారు. తాజాగా యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాకు హాజరయ్యాడు. ఈ సందర్బంగా సంగం ఘాట్ వద్ద పవిత్ర స్నానం చేశాడు. అనంతరం మీడియాతో తన అనుభూతిని పంచుకున్నాడు. ఇక్కడికి రావడంతో తన జన్మ ధన్యమైందన్నాడు. అంతే కాదు పవిత్ర స్నానం చేయడం అద్భుతంగా అనిపించిందని చెప్పాడు కబీర్ ఖాన్(Kabir Khan).
Kabir Khan Shocking Comments
ఇక్కడ హిందూ, ముస్లిం అన్న తేడా లేనే లేదన్నారు. కులం, మతం , జాతి, ప్రాంతం అన్న తేడా లేకుండా లక్షలాది మంది పవిత్ర స్నానం చేస్తున్నారని పేర్కొన్నాడు. ప్రతి దానిని భూతద్దంలో చూడటం మానేయాలని సూచించాడు. ఎవరైనా రావచ్చు..తమకు తోచిన రీతిలో స్నానం చేయొచ్చని తెలిపాడు కబీర్ ఖాన్.
తను బాలీవుడ్ లో సూపర్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. చక్ దే ఇండియా సినిమా తీశాడు. ఇది వరల్డ్ వైడ్ గా ఆదరణ పొందింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముస్లిం అయినంత మాత్రాన పవిత్ర స్నానం చేయకూడదని ఏమైనా రూల్ ఉందా అని ప్రశ్నించాడు. ఇతరుల మనోభావాలను గౌరవించడం మన ధర్మమని అన్నాడు.
ఇదే సమయంలో దర్శకుడు కబీర్ ఖాన్ భారత ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రశంసించాడు. ఇందులో హిందూ లేదా ముస్లిం లేదన్నారు. మీరు భారతీయుడని నమ్మితే మీరు ప్రతిదీ అనుభూతి చెందాలని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు.
Also Read : Hero Mahesh-Priyanka : ప్రిన్స్ సరసన ప్రియాంకేనా