Pawan Kalyan : టాలీవుడ్ లో దమ్మున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తదుపరి చిత్రం ప్లాన్ చేస్తున్నాడా..? అవుననే సమాధానం వస్తోంది టాలీవుడ్ నుంచి. ఇప్పటికే పవర్ ఫుల్ కథతో, అద్బుతమైన టేకింగ్ తో చిత్రీకరించే సత్తా ఉన్న దర్శకుడిగా పేరు పొందాడు. ఇక దర్శకుల హీరోగా గుర్తింపు పొందిన పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రస్తుతం ఫుల్ ఫోకస్ పెట్టాడు హరి హర వీరమల్లుపై. ఇది ఆఖరి దశలో ఉంది. ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇప్పటికే ప్రకటించిన విధంగానే మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.
Pawan Kalyan – Gopichand Malineni Movie
ఈ తరుణంలో నెక్ట్స్ సినిమా చేసే ప్లాన్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బిజీగా ఉన్నాడని, ప్రత్యేకించి పలువురు దర్శకుల నుంచి కథలను కూడా వింటున్నారని వినికిడి. ఇటీవల తన తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని బడిలో జరిగిన అగ్న ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కొంత ఆందోళనకు గురైన పవన్ కల్యాణ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ఈ సమయంలో కీలక అప్ డేట్ వచ్చింది. గోపిచంద్ మలినేని పవన్ కళ్యాణ్ ను కలిసి కథ చెప్పాడని, దీనికి ఫుల్ ఇంప్రెస్ అయ్యాడని ..ఓకే కూడా చెప్పాడనిజోరుగా ప్రచారం జరుగుతోంది.
గోపిచంద్ మలినేనికి కమర్షియల్ సినిమాలను సక్సెస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. తను వరుస మూవీస్ తో దూసుకు పోతున్నాడు. నందమూరి బాలకృష్ణతో వీర సింహారెడ్డి తీశాడు. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జాట్ తశాడు . ఇందులో సన్నీ డియోల్, రణ్ దీప్ హూడా, రెజీనా నటించారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాప్ లో దూసుకు పోతోంది. కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ మరో మూవీ ఓజీ కూడా పూర్తయింది. మంచి ప్రాజెక్టు కోసం తయారు చేసుకుని రావాలని పవన్ గోపిచంద్ కు చెప్పినట్లు టాక్.
Also Read : SS Thaman Shocking Comment :డీఎస్పీని తీసుకోవడంపై థమన్ కామెంట్స్