Pradeep Ranganathan : తమిళ సినీ రంగానికి చెందిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేరు. తొలుత షార్ట్ ఫిలిం తీశాడు. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారాడు. ఇంకేం లవ్ టుడే అంటూ దుమ్ము రేపాడు. ఈ చిత్రం ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ గా నిలిచింది.
Director Buchibabu Praises Pradeep Ranganathan
కథ బాగుంటే సినిమా తానంతట అదే ఆడుతుందని, ఇంకొకరిని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ హీరో. తను తాజాగా నటించిన డ్రాగన్ మూవీ రికార్డుల మోత మోగిసింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఊహించని రీతిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ప్రత్యేకించి కుర్రకారుకు తను ఆరాధ్య దైవంగా మారి పోయాడు ప్రదీప్ రంగనాథన్. డ్రాగన్ విడుదలైన అన్ని చోట్ల దూసుకు పోతోంది. మూవీ మేకర్స్ డ్రాగన్ చిత్రాన్ని తమిళ్ , తెలుగు వెర్షన్ లలో రిలీజ్ చేశారు. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. నివ్వెర పోయేలా చేసింది.
ఇందులో కాయదు లోహర్ కీలక పాత్రలో నటించింది. ఇక ప్రదీప్ రంగనాథన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగానే తాను నటించేందుకు ఇష్ట పడతానని అన్నాడు. తాజాగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన(Director Buchibabu) డ్రాగన్ సినిమాను, ప్రదీప్ రంగనాథన్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.
Also Read : Beauty Niharika Movie :ఆహాలో నిహారిక కొణిదల మూవీ