Adipurush: ‘ఆదిపురుష్‌’లో రావణుడి పాత్రపై ‘రామాయణ్‌’ సీత సంచలన వ్యాఖ్యలు !

‘ఆదిపురుష్‌’లో రావణుడి పాత్రపై ‘రామాయణ్‌’ సీత సంచలన వ్యాఖ్యలు !

Hello Telugu - Adipurush

Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్‌’. భారీ బడ్జెట్ గా తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. మరోవైపు ఈ సినిమాలో పాత్రల వేషధారణలపై ఎన్నో వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రావణుడి పాత్రపై రామాయణ్‌ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని పాత్రలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Adipurush…

‘ఆదిపురుష్‌(Adipurush)’ చూసిన పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందేమోనని భావిస్తారు. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఆ విషయం తలచుకుంటే బాధేస్తుంది. ఈ చిత్రంలో చూపించినట్లు రావణుడు ఉండడని వాళ్లకు ఎవరూ వివరించడం లేదు. దీంతో రామాయణంలో రాముడు, సీత కూడా ఇలానే ఉంటారని వారు నిర్ణయించుకుంటున్నారు. రావణుడు గొప్ప శివభక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలున్నాయి. ఆయన జీవితంలో చేసిన ఒకేఒక్క తప్పు సీతను అపహరించడమే. ఆ ఒక్కటి చేయకపోతే ఆయన గొప్ప పండితుడిలా ఉండేవారు. అంత గొప్ప వ్యక్తిని ‘ఆదిపురుష్‌’లో రోడ్‌ సైడ్ రౌడీలా చూపించడం నన్ను బాధించింది.

నేను ఈ సినిమాను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదు. టీవీలో కొంతభాగం చూసేసరికే తట్టుకోలేకపోయాను. సీతాదేవిని గులాబీరంగు చీరలో చూపడం, రావణాసురుడిని విభిన్నమైన ఆహార్యంలో చూపించడం ఏమాత్రం నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాల జోలికిపోకుండా యువతలో స్ఫూర్తి నింపే స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను సినిమాలుగా తీస్తే బాగుంటుంది’ అని దీపికా అభిప్రాయపడ్డారు.

Also Read : Ramoji Rao: రామోజీరావు మృతికి సంతాపంగా ఆదివారం సినిమా షూటింగులు బంద్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com