Dinesh Phadnis : సర్ఫరోష్ సహా సుమారు 30కు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించి… సీఐడీ షో ద్వారా పాపులర్ అయిన బాలీవుడ్ సీనియర్ నటుడు దినేశ్ ఫడ్నీస్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. రెండు రోజుల క్రితం గుండె పోటుతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన దినేశ్ ఫడ్నీస్ ప్రస్తుతం వెంటిలేటర్ పై అందుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన పలువురు నటులు ఆస్పత్రికి చేరుకుని ఆయన్ను పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలో దినేశ్ ఫడ్నీస్ సహనటుడు దయానంద్ శెట్టి స్పందిస్తూ… దినేశ్(Dinesh Phadnis) అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నమాట వాస్తవమే! ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు గుండెపోటు రాలేదు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిపాలయ్యాడు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు అని తెలిపాడు. దీనితో సీఐడీ సీరియల్ అభిమానులు… ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Dinesh Phadnis – 20 ఏళ్లగా సీఐడీ సీరియల్ లో నటిస్తున్న దినేశ్ ఫడ్నీస్
సర్పరోష్ వంటి సినిమాల్లో నటించిన దినేశ్ ఫడ్నీస్… 1998లో మొదలైన సీఐడీ షో దాదాపు 20 ఏళ్లు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమైన సీఐడీ సీరియల్ లో ఫ్రెడరిక్స్ అనే పాత్రను పోషించాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన సీరియల్ ‘సిఐడీ’లో తనదైన కామెడీ పంచ్ లతో దినేశ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. జనరల్ ఆడియన్స్ కి క్లూస్ అండ్ ఫోరెన్సిక్ విభాగాన్ని పరిచయం చేసింది ఈ సీఐడీ సీరియలే.సీఐడీతో పాటు హిట్ సీరియల్ తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్‌లోనూ అతిథి పాత్రలో నటించాడు దినేశ్.
Also Read : Aamir Khan: అమీర్‌ఖాన్ ను బాధించిన ‘లాల్‌సింగ్ చడ్డా’