దిల్జిత్ దోసంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పంజాబ్ కు చెందిన ఈ గాయకుడు మోస్ట్ పాపులర్. ఆ మధ్యన రైతులు చేపట్టిన ఉద్యమానికి బేషరతుగా మద్దతు తెలిపాడు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ను పట్టించుకోక పోతే మిగిలేది శూన్యమేనని హెచ్చరించాడు. అతడిని ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాడంటూ ఆ మధ్యన ఆరోపణలు గుప్పించారు. కానీ తను వెనక్కి వెళ్లలేదు.
పాటలే తన ప్రాణమని, పాడకుండా ఉండలేనంటూ ప్రకటించాడు. తాజాగా కొత్త ట్రాక్ విడుదల చేశాడు. ఇప్పుడు దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాటలో దమ్ముంటే ఎవరైనా ఇష్ట పడతారని, దానికి కులం, మతంతో సంబంధం అంటూ ఉండదని స్పష్టం చేశాడు దిల్జీత్ దోసాంజ్.
తను తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన సియాతో కలిసి పని చేశాడు. ఆమె కూడా పంజాబీలో పాడేందుకు ట్రై చేసింది. హౌస్ హౌస్ సంస్థ మ్యూజిక్ వీడియోను తీసింది. ఇద్దరూ పెప్సీ నంబర్ కి వైబ్ గా కనిపించేలా ఉండడం విశేషం.
ఎవరూ ఊహించ లేదు సియా ఇంత అద్భుతంగా ఆలాపిస్తుందని. ఇప్పుడు పంజాబీలంతా ఆమె గానంతో ఫిదా అవుతున్నారు. ఇక చెప్పాల్సింది ఏముంది దిల్జిత్ దోసాంజ్ గురించి అంటున్నారు. అవును పాటంటే జనం గుండె గొంతుక కదూ.