Dil Raju : ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు పెద్దపీట వేసిన తెలంగాణ సర్కార్

ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవ్వరికీ తెలీదు...

Hello Telugu - Dil Raju

Dil Raju : టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా, సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకెళుతోన్న నిర్మాత దిల్ రాజు. వరుస చిత్రాలతో టాలీవుడ్‌లో బిజీగా ఉండే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మ‌న్‌గా వెంకట రమణ రెడ్డి అలియాస్ దిల్ రాజు(Dil Raju)నూ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ప్రకటన జారీ చేశారు జారీ చేశారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న రెండేళ్ల‌పాటు కొనసాగనున్నారు.

Dil Raju…

మరో వైపు ఆయన పెద్ద సినిమాలనే కాకుండా చిన్న సినిమాలు, యంగ్ జనరేషన్ ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “యంగ్ జనరేషన్‌తో సినిమాలు చేయాలని ఉంది. ఎందుకంటే, ఎందుకో నేను కొంత ఈ జనరేషన్‌కు డిస్కనెక్ట్ అయ్యానా అని అనిపిస్తుంది. గతంతో నా జర్నీలో అన్నీ అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అందరి స్టార్ హీరోలతో చేశాము. ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అయింది. ఇప్పుడు మా వద్ద కంటెంట్‌కి కొదవలేదు. చాలా కంటెంట్ సిద్దం చేశాము. వరుస సినిమాలు చేస్తున్నాము కాబట్టి గ్యాప్ రాకూడదని, న్యూ టాలెంట్స్‌ను ఎంకరేజ్ చేయాలని కొత్త బ్యానర్ ‘దిల్ రాజు(Dil Raju) డ్రీమ్స్’ పేరుతో రాబోతున్నాం. యంగ్ జనరేషన్‌కు ఇదొక అద్భుతమైన ప్లాట్‌ఫామ్. 360 డిగ్రీస్‌లో అందుబాటులో ఉండాలనే థాట్‌తో ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్నాము.

ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవ్వరికీ తెలీదు. నా దగ్గరకు చాలా మంది వచ్చి పోస్టర్‌లు, టీజర్‌లు రిలీజ్ చేయమని అడుగుతారు. అవి చూడగానే నాకు అర్థం అవుతుంది. ఇలాంటి చిత్రాలు ఎందుకు తీస్తారు.. ఎవరు చూస్తారు? అని చెప్పేస్తాను. అక్కడ ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుస్తుంది. అందుకే ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయాలని, సరైన ఫ్లాట్ ఫాం ఉండాలని దిల్ రాజు డ్రీమ్స్‌ను స్థాపించాను. ‘దిల్ రాజు డ్రీమ్స్’కు అనేక టీమ్స్‌ను ఫామ్ చేశాం. కథలు, సినిమాల నిర్మాణం, విడుదల వరకు.. న్యూటాలెంట్‌కు సపోర్ట్ చేయాలనేదే మా ఆలోచన. దీనికోసం ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేశాము. త్వరలోనే దానిని లాంచ్ చేయనున్నాం. ఇదంతా కార్పొరేట్ స్టయిల్‌లో ఆర్గనైజ్డ్ సిస్టమ్‌గా ఉంటుంది. స్క్రిప్ట్ రివ్యూ పేరుతో ఎక్స్‌పెరిమెంట్ కూడా చేయాలనుకుంటున్నాము. మీడియా వారిని ఈ విషయంలో ఇన్ వాల్వ్ చేయాలనుకుంటున్నాము. ఇదే నా పూర్తి ఆలోచన. అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం..” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Also Read : Allu Arjun : తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి నగదు ప్రకటించిన బన్నీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com